Mon Dec 23 2024 20:15:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సోనియా కీలక భేటీ
నేడు కాంగ్రెైస్ చీఫ్ సోనియా గాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. జీ 23 నేతలు సమావేశానికి హాజరుకానున్నారు.
నేడు కాంగ్రెైస్ చీఫ్ సోనియా గాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాన కార్యదర్శులతో పాటు జీ 23 నేతలు సమావేశానికి హాజరుకానున్నారు. సోనియా గాంధీ నివాసంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ వినపడుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న సూచనలు కూడా వినవస్తున్నాయి.
జీ 23 నేతలతో....
ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ నేడు కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఏఐసీసీని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశముంది. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు అధ్కక్ష ఎన్నికపై కూడా నేతల అభిప్రాయాలను సోనియా గాంధీ తెలుసుకోనున్నారు. ఇందులో జీ 23 నేతలను కూడా పిలిచి వారి సూచనలను, సలహాలను తీసుకోవాలని సోనియా నిర్ణయించడంతో ఈ సమావేశం కీలకంగా మారనుంది.
Next Story