Mon Dec 23 2024 04:08:07 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలేష్ పై పోటీకి కాంగ్రెస్ దూరం
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ యాదవ్ పై పోటీకి దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై పోటీకి దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అయితే అఖిలేష్ యాదవ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయన కర్నాల్ నియజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఎన్నికల తర్వాత....?
కర్నాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీకి దింపరాదని నిర్ణయించింది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నిర్ణయం అఖిలేష్ యాదవ్ కు ఊరట కల్గించే అంశం. ఎన్నికల అనంతరం జరగనున్న పొత్తులో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story