Mon Dec 23 2024 11:59:32 GMT+0000 (Coordinated Universal Time)
పీసీసీ చీఫ్ లు రాజీనామా చేయండి.. సోనియా ఆదేశం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాలని సోనియాఆదేశించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు. ఇటీవల జరిగిన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించారు.
ఎన్నికల ఫలితాలపై....
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఆ ఐదు రాష్ట్రాలలో కొత్త నాయకత్వానికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని సోనియా గాంధీ నిర్ణయించారు. అందుకే వారంతా రాజీనామా చేయాలని ఆదేశించారు.
Next Story