డీకే మ్యూజిక్ ఎలా ఉంటుందో?
కర్ణాటకముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా నిర్ణయానికి రాలేదు. ఫలితాలు వచ్చి నాలుగురోజులవుతుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి నాలుగు రోజులవుతుంది. కన్నడ ప్రజలు స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్‌కు ఇచ్చారు. 136 స్థానాలు ప్రజలు ఇచ్చినా ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చించేందుకు నాలుగు రోజులు సమయం పడుతుంది. ఈరోజు తేలుస్తామని ఏ రోజుకారోజు ఫిల్లర్లు వదులుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని శాసనసభ్యులు చెప్పినా ఇంకా నిర్ణయం వెలువడలేదు.
నేడు ప్రకటన ఉంటుందా?
నిన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లతో అగ్రనేతలు చర్చించారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నా అది కూడా ఎంతవరకు మలవుతుందన్నది మాత్రం చెప్పలేదు. ప్రజలందరూ కాంగ్రెస్‌కు గంపగుత్తగా ఓట్లేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంపై ఆ పార్టీ బలహీనతను కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. మరి డీకే మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి మరి.