Thu Dec 26 2024 19:08:51 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కన్హయ్య కుమార్ పై దాడికి కారణం అదేనా?
కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరిగింది. ఆయన ఢిల్లీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి జరిగింది. ఆయన ఢిల్లీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. నిన్న రాత్రి ఈశాన్య ఢిల్లీలో ప్రచారంలో ఉండగా ఒక యువకుడు అతనిపైకి వచ్చి చెంపదెబ్బ కొట్టాడు. పూలమాల వేసేందుకు వచ్చిన ఆ యువకుడు కన్హయ్య కుమార్ ను కొట్టడంతో అక్కడున్న వారంతా క్షణం పాటు నిశ్చేష్టలయ్యారు.
పూలమాల వేసేందుకు...
ఉస్మాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే వెంటనే కన్హయ్య కుమార్ పై దాడి చేసిన యువకుడిని ఆయన అనుచరులు పట్టుకుని చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే కన్హయ్య కుమార్ పై ఆ యువకుడు దాడి ఎందుకు చేశాడన్న దానిపై మాత్రం కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story