Thu Dec 19 2024 23:07:34 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంకకు కరోనా
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రియాంక గాంధీకి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో తెలిపారు. అయితే స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తనతో కాంటాక్టు అయిన....
తనను వారం రోజుల నుంచి కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు. తాను, తన తల్లి సోనియాగాంధీ సురక్షితంగా ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. సోనియా గాంధీకి కూడా నిన్న కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆమె హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
Next Story