Thu Dec 19 2024 15:16:05 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka : సోదరుడి కోసం నేటి నుంచి రాయబరేలిలో
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు రాయబరేలి లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు రాయబరేలీలోనే పర్యటిస్తారు
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు రాయబరేలి లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ప్రియాంక గాంధీ రాయబరేలీలోనే పర్యటిస్తారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రియాంక ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రాయబరేలిలో రాహుల్ ను గెలిపించే లక్ష్యంతో ప్రియాంక గాంధీ పర్యటన సాగనుంది. రాయబరేలి గాంధీ కుటుంబానికి అడ్డా. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాహుల్ గాంధీ కేరళలోనే వాయనాడ్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీచేస్తున్నారు.
గెలిచేందుకు...
రాయబరేలిలో గెలిచి గాంధీ కుటుంబానికి అండగా ఉంటున్న నియోజకవర్గంలో మళ్లీ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. రాయబరేలిలో ప్రియాంక గాంధీ పర్యటనతో మరింత పార్టీలో ఊపు వస్తుందని అన్నారు. ఇక్కడ రాహుల్ గెలుపు గ్యారంటీ అని, కేవలం మెజారిటీని అత్యధికంగా సాధించడమే ముఖ్య ఉద్దేశ్యమని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ రాయబరేలి రెండు రోజుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు.
Next Story