Sun Dec 22 2024 13:35:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వాయనాడ్ స్థానాన్ని వదులుకున్న రాహుల్.. ఎన్నికల బరిలో ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఆయన రాయబరేలీని ఉంచుకోనున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్, ఉత్తర్ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసి రెండు స్థానాల నుంచి గెలిచారు. దీంతో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
బరిలో ప్రియాంక...
మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ అగ్రనేతలు వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీని వాయనాడ్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. వాయనాడ్ నుంచి 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గెలిచారు. నాడు అమేధీ నుంచి ఓడిపోయారు. దీంతో ఈసారి వాయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయించారు. అతి కష్టం మీద వాయనాడ్ ను వదులుకోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు.
Next Story