Mon Dec 23 2024 04:42:08 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : మణిపూర్ టు ముంబయి.. మరో యాత్రకు రాహుల్ రెడీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో సుదీర్ఘ యాత్రకు సిద్ధమవుతున్నారు. మణిపూర్ నుంచి ముంబయి వరకూ యాత్ర కొనసాగనుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో సుదీర్ఘ యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టనున్నారు. వచ్చే నెల 14వ తేదీన రాహుల్ గాంధీ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యాత్రకు భారత్ న్యాయయాత్ర అని నామకరణం చేశారు. అయితే హైబ్రిడ్ విధానంలో ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు నుంచి పశ్చిమం వైపు ఈ యాత్ర సాగనుంది.
6,200 కిలోమీటర్లు...
అంటే రాహల్ గాంధీ బస్సు, పాదయాత్ర ద్వారా దీనిని పూర్తి చేయనున్నారు. మణిపూర్ లో జనవరి 14వ తేదీన ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 20న ముంబయిలో ముగిసేలా ప్లాన్ చేశారు. మొత్తం 6,200 కిలోమీటర్ల మేర యాత్ర పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ ప్రజల్లో మమేకమవుతూ ఈ యాత్రలో పలు వర్గాల ప్రజలను కలుసుకోనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. తాము అధికారంలోకి వస్తే వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వనున్నారు.
ముంబయిలో ముగింపు...
ఈ యాత్ర పథ్నాలుగు రాష్ట్రాల్లో 85 జిల్లాల నుంచి వెళుతుంది. యాత్ర ప్రారంభమయ్యే మణిపూర్ లోనూ, ముగించే ముంబయిలోనూ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు కార్నర్ మీటింగ్ లతో పాటు అనేక వర్గాల ప్రజలతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కొనసాగించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఈ భారత్ న్యాయయాత్ర చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
Next Story