Tue Dec 24 2024 05:23:42 GMT+0000 (Coordinated Universal Time)
కేంబ్రిడ్జిలో రాహుల్ ప్రసంగం
కాంగ్రెస్ నేత రాహుల్ మార్చిలో బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లో ప్రసంగిస్తారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని బిజినెస్ స్కూల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాను చదువుకున్న విద్యాసంస్థ కేంబ్రిడ్జి యూనివర్సిటీలోనే రాహుల్ ప్రసంగిస్తున్నారు.
ఎదురు చూస్తున్నానంటూ...
"నేను చదువుకున్న విద్యాసంసథ కేంబ్రిడ్జి యూనివర్సిటీ సందర్శన కోసం ఎదురు చూస్తున్నా" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ సందర్శన సమయంలో కొందరు మేధావులతో సమావేశమై భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలపై చర్చించేందుకు ఉత్సాహంగా ఉందని రాహుల్ పేర్కొన్నారు.
Next Story