Tue Apr 15 2025 18:58:19 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : ఎన్నికల ఫలితాలపై రాహుల్ ఏమన్నారంటే?
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈసారి దేశంలో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఇండియా కూటమి దేశంలో గెలవబోతుందని చెప్పారు.
ఇండియా కూటమిదే విజయం...
అంతేకాదు ఢిల్లీలో ఉన్న ఏడు సీట్లలో కూడా ఇండియా కూటమి విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీపై ప్రజల్లో తీవరమైన వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్లపై దాడి చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని మరోసారి ఫైర్ అయ్యారు.
Next Story