Sat Dec 21 2024 09:04:14 GMT+0000 (Coordinated Universal Time)
పాదయాత్రకు నాయకత్వం నేను వహించడం లేదు
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే తాను భారత్ జోడో యాత్రను చేపట్టానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే తాను భారత్ జోడో యాత్రను చేపట్టానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పాదయాత్రకు తాను నాయకత్వం వహించడం లేదన్నారు. నాగర్‌కోయిల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ కాంగ్రెస్ నాయకుడిగా తాను పాదయాత్రలో పాల్గొంటున్నానని తెలిపారు. తాము చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఈ యాత్రను చేపట్టానని తెలిపారు. తన యాత్రపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చని అన్నారు.
బీజేపీ విధానాలను...
దేశయాత్రకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, అందులో తాను పాల్గొంటున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుందన్నారు. బీజేపీ విపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతుందని తెలిలపారు. దేశ ప్రజలను అర్థం చేసుకునేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానని అన్నారు. బీజేపీ విధానాల వల్ల దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
Next Story