Tue Dec 24 2024 05:20:49 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ దోషి : రెండేళ్లు జైలు శిక్ష
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. సూరత్ కోర్టు దోషిగా తేల్చింది
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేతలు వేసిన పరువు నష్టం దావా కేసులో రాహుల్ ను దోషిగా న్యాయస్థానం తేల్చింది. 2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకల ఆయన మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ ఆయన ప్రశ్నించడం అప్పట్లో వివాదంగా మారింది.
2019లో...
రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పు పడుతూ సూరత్ బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2019లో దాఖలయన కేసులో నేడు తీర్పు వచ్చింది. మోదీ పరువునకు నష్టం కలిగించారంటూ వారు ఈ దావా వేశారు. అయితే తాజాగా ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయస్థానం రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఈ కేసులో రాహుల్ కు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది.
Next Story