Tue Dec 24 2024 05:26:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అప్పీల్ కు రాహుల్
సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయనున్నారు. సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. సూరత్ కోర్టును తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
సవాల్ చేస్తూ...
మధ్యాహ్నం 3 గంటలకు సూరత్ కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. తన న్యాయవాదులతో కలసి అప్పీల్ చేయనున్నారు. తనకు సూరత్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని అప్పీల్లో కోరనున్నారు. కోర్టు రెండేళ్లు శిక్ష వేయడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు కూడా వేసింది. ఈరోజు సూరత్ కు రాహుల్ వెంట ప్రియాంక గాంధీ కూడా వెళ్లనున్నారు.
Next Story