Mon Dec 23 2024 04:12:50 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : ఎనిమిదో రోజుకు రాహుల్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రఎనిమిదో రోజుకు చేరుకుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రఎనిమిదో రోజుకు చేరుకుంది. మరికాసేపట్లో అరుణాచల్ ప్రదేశ్ కు యాత్ర చేరుకోనుంది. మణిపూర్ నుంచి బయలుదేరిన రాహుల్ యాత్ర మణిపూర్, నాగాలాండ్, అసాంల మీదుగా అరుణాచల్ ప్రదేశ్ కు చేరుకుంది. ఆరు వేల కిలోమీటర్ల మేర రాహుల్ ఈ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టనున్నారు.
నేడు అరుణాచల్ ప్రదేశ్ లోకి...
యాత్రకు ప్రతి చోట మంచి స్పందన లభిస్తుండటంతో ఉత్సాహంగా రాహుల్ కొనసాగుతున్నారు. యువకులు, మేధావులు, మహిళలతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎననికలలో ఇండియా కూటమిని విజయం వైపు నడిపే దిశగా రాహుల్ అడుగులు వేస్తున్నారు. రాహుల్ తొలి విడత చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ సక్సెస్ కావడంతో రెండో యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.
Next Story