Mon Dec 23 2024 05:01:41 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : మూడోరోజుకు చేరుకున్న రాహుల్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నేడు మూడోరోజుకు చేరుకుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నేడు మూడోరోజుకు చేరుకుంది. నాగాలాండ్ నుంచి నేటి ఉదయం తన యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. నాగాలాండ్ లో ఐదు జిల్లాల్లో 257 కిలోమీటర్ల యాత్ర చేయనున్నారు. మొత్తం రెండు రోజుల పాటు నాగాలాండ్ లో పర్యటించనున్నారు. అనంతరం అసోం రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రవేశిస్తుంది.
లోక్ సభ ఎన్నికల్లో...
భారత్ జోడో న్యాయ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ యాత్రను చేపడుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు మహాకూటమిలో ఉన్న పార్టీల నేతలు కూడా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. అసోంలో ఎనిమిదిరోజుల పాటు యాత్ర జరగనుంది. మొత్తం 833 కిలోమీటర్ల పాదయాత్ర 17 జిల్లాల నుంచి సాగనుంది. లోక్ సభ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా రాహల్ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతుంది.
Next Story