Mon Dec 23 2024 07:13:10 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లో కరోనా కలవరం..ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్
ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేకెదాటు అనే పేరుతో పాదయాత్ర జరిగింది. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్
కాంగ్రెస్ లో కరోనా కలవరం మొదలైంది. దేశంలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా బారిన పడి.. హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు ఖర్గే కార్యాలయ వర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్ లో సురక్షితంగానే ఉన్నారని తెలిపింది. రెండ్రోజులుగా తనను కలిసినవారంతా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు.
ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేకెదాటు అనే పేరుతో పాదయాత్ర జరిగింది. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. 10 రోజులపాటు ఈ యాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యే ఎన్ హెచ్ శివశంకర రెడ్డి కూడా వైరస్ బారిన పడ్డారు. కాగా.. ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాత్రం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించారు. ఖర్గే, మొయిలీ కి పాజిటివ్ గా నిర్థారణ అవ్వడంతో.. కాంగ్రెస్ మేకెదాటు పాదయాత్రను ఆపివేసింది.
Next Story