Mon Dec 23 2024 10:43:58 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మూకుమ్మడి రాజీనామాలు?
కాంగ్రెస్ నేతలు సీరియస్ నిర్ణయం తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా రాజీనామాలు చేయబోతున్నారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీరియస్ నిర్ణయం తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా రాజీనామాలు చేయబోతున్నారు. తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేసి స్ట్రాంగ్ గా నిరసన తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనకు పార్టీ హైకమాండ్ ఆమోదించాల్సి ఉంటుంది. రాహుల్ పై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఆరు కూడా పరువు నష్టం దావా కేసులే. రాజకీయ ఆరోపణలను కూడా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా తీసుకుని ఎంపీగా అనర్హత వేటు వేసిందని చెబుతున్నారు.
రాహుల్ కు మద్దతుగా...
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా అయితే మూకుమ్మడి రాజీనామాలు చేశారో అదే తరహాలో రాజీనామాలను కేంద్రంలో అధికార పార్టీ బీజేపీపై ప్రయోగించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీల మూకుమ్మడి రాజీనామాల విషయం మరికాసేపట్ల స్పష్టత ఇవ్వనుంది. దేశ వ్యాప్తంగా అందరూ రాజీనామాలు చేసే అవకాశం కూడా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన ఇలాంటి వాటిపై స్ట్రాంగ్ గా నిరసనలు తెలియజేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం. మధ్యాహ్నం ఒంటి గంటకు రాహుల్ గాంధీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Next Story