Sat Dec 21 2024 06:24:26 GMT+0000 (Coordinated Universal Time)
మైసూరుకు చేరుకున్న సోనియా
కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వచ్చారు
కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వచ్చారు. ఆమె యాత్రలో పాల్గొనేందుకు మైసూరు వచ్చారు. మైసూరు విమానాశ్రయంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
జోడో యాత్రలో..
కేరళ నుంచి కర్ణాటకలో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర మైసూరు ప్రాంతానికి చేరుకోనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు సోనియా గాంధీ వచ్చారు. మరి కొద్ది రోజుల్లో ప్రియాంక గాంధీ కూడా జోడో యాత్రలో పాల్గొనేందుకు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story