Mon Dec 23 2024 09:38:09 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ ఇక రోడ్డు మీదనే
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతుంది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతుంది. దళల వారీగా పోరాటాలు చేయాలని, తద్వారా మోదీ నియంత పోకడలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడిగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై దేశంలో సర్వత్రా నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించింది. నిన్న సాయంత్రం సమావేశమైన కాంగ్రెస్ ముఖ్యనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దశల వారీగా....
రాష్ట్రాల్లో నిరసనలు ప్రదర్శనలు చేస్తూ ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు మేధావులతో పాటు విపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. రాహుల్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ చర్యలకు దిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. విపక్షాలన్నీ తమ ఆందోళనలకు కలసి రావాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే పిలుపు నిచ్చింది.
Next Story