Mon Dec 23 2024 04:27:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ ఎదుటకు సోనియా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు నేడు మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు నేడు మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. నిజానికి నిన్ననే హాజరు కావాల్సి ఉండగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఉండటంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈరోజు ఉదయం11 గంటలకు సోనియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆమెను అధికారులు రెండోసారి విచారణ చేయనున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో...
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సోనియాకు కరోనా సోకడంతో ఆమె విచారణ అప్పట్లో వాయిదా పడింది. తాజాగా ఇటీవల విచారణ చేసిన అధికారులు మధ్యాహ్నం రెండు గంటల వరకే విచారించారు. ఈరోజు మరోసారి విచారణ చేయాలని నిర్ణయించి నోటీసులు జారీ చేశారు. సోనియాను ఈడీ విచారణను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగుతుంది. మనీలాండరింగ్ జరిగిందన్న దానిపై ఎక్కువగా ఈరోజు విచారించనున్నారని తెలిసింది.
Next Story