Fri Dec 27 2024 14:03:26 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ వచ్చేయ్.. తీర్మానాల తాకిడి
రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకోవాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు తీర్మానాలు చేస్తున్నాయి
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొద్దిరోజుల మాత్రమే సమయం ఉంది. అయితే రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకోవాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు తీర్మానాలు చేస్తున్నాయి. తీర్మానాలు చేసి ఏఐసీసీకి పంపుతున్నాయి. రాహుల్ గాంధీ తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోనన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు.
రాష్ట్ర విభాగాలు....
ఇందులో భాగంగా రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. కొత్త అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలను చేపట్టాలని ఆ యా రాష్ట్ర శాఖలు కోరుతున్నాయి. వరసగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పంపుతున్న తీర్మానాలకు రాహుల్ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story