Sat Dec 21 2024 04:52:25 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ యాత్రకు ఒకరోజు విరామం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేడు విరామం ప్రకటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేడు విరామం ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభమై వారంరోజులు దాటడంతో ఒకరోజు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేరళలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 7వ తేదీన తమిళనాడులో ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళలో కొనసాగుతుంది. అయితే రాహుల్ తో పాటు సిబ్బంది కూడా కొంత ఇబ్బంది పడుతుండటంతో యాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు.
రేపటి నుంచి...
యాత్ర తిరిగి రేపటి నుంచి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. కేరళలో మొత్తం 18 రోజుల పాటు రాహుల్ యాత్ర కొనసాగాల్సి ఉంది. కేరళ నుంచి ఈ నెల 30న కర్ణాటకలోకి చేరుకుంటుంది. రోజుకు రాహుల్ గాంధీ 25 కిలోమీటర్ల మేరకు నడకను కొనసాగిస్తున్నారు. ఈరోజు విరామం అనంతరం రేపు తిరిగి యాత్ర ప్రారంభం కానుంది.
Next Story