Fri Dec 20 2024 22:19:52 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : నేడు బీహార్‌లోకి రాహుల్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. ఈ నెల 14వ తేదీన యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ బీహార్‌లోకి ప్రవేశించడంతో కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. మణిపూర్ నుంచి ముంబయి వరకూ రాహుల్ భారత్ జోడో న్యాయయాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. యాత్రకు కొంత విరామమిచ్చిన తర్వాత రాహుల్ గాంధీ తిరిగి నేటి నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం మారడంతో...
అయితే నిన్నటి వరకూ కాంగ్రెస్ కూటమిలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవికి రాజీనామా చేసి బీజేపీ కూటమిలోకి చేరిపోయారు. నిన్న బీహార్ లో ప్రభుత్వం మారడం, నేడు రాహుల్ గాంధీ యాత్ర బీహార్ లో ప్రవేశిస్తుండటంతో రాహుల్ నుంచి ఎలాంటి విమర్శలు వెలువడతాయన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
Next Story