Fri Dec 20 2024 22:30:58 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : నేటి నుంచి మళ్లీ రాహుల్ న్యాయ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు బీహార్లో మళ్లీ ప్రారంభం కానుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు బీహార్లో మళ్లీ ప్రారంభం కానుంది. నేడు బీహార్ లోని ఔరంగాబాద్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది. జనవరి పథ్నాలుగో తేదీ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను మణిపూర్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బీహార్ లోని...
ఇప్పటికే నెలరోజుల నుంచి ఆయన యాత్ర చేస్తున్నారు. మధ్యమధ్యలో బ్రేక్ ఇస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు. నిన్న జైపూర్ లో సోనియా గాంధీ నామినేషన్ కు హాజరైన రాహుల్ గాంధీ, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపి తిరిగి బీహార్ నుంచి యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 20న ముంబయిలో రాహుల్ తన యాత్రను ముగించనున్నారు.
Next Story