Sat Dec 21 2024 05:12:50 GMT+0000 (Coordinated Universal Time)
కేరళలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళలో కొనసాగుతుంది. ఆయన లంచ్ బ్రేక్ కోసం ఆగారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళలో కొనసాగుతుంది. ఆయన లంచ్ బ్రేక్ కోసం ఆగారు. తిరిగి నాలుగు గంటల సమయంలో ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. కేరళలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. కేరళ సంస్కృతితో ఆయనకు పెద్దయెత్తున పార్టీ నేతలు అభిమానులు స్వాగతం పలికారు. ఈ నెల 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమయిన రాహుల్ పాదయాత్ర నిన్న రాత్రి కేరళకు చేరుకుంది.
రోజుకు పాతిక కిలోమీటర్లు..
రోజుకు పాతిక కిలోమీటర్ల మేర ఆయన నడక కొనసాగుతుంది. మధ్యలో సామాన్య ప్రజలతో రాహుల్ మమేకం అవుతున్నారు. వారితో కలిసి ముచ్చటిస్తున్నారు. లంచ్ టైమ్ లో పార్టీ నేతలతో భేటీలు సాగుతున్నాయి. కేరళ నేతలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి నేతలు వచ్చి ఆయనను కలుస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు అక్కడకు వచ్చి యాత్రలో పొల్గొంటున్నారు. తన పాదయాత్రపై వస్తున్న విమర్శలకు అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ కౌంటర్ ఇస్తూ కొనసాగుతున్నారు.
Next Story