Mon Dec 23 2024 12:13:26 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మ్యానిఫేస్టో పై నేడు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Congress :ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మ్యానిఫేస్టో పై నేడు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పర్యటించిన రాహుల్ గాంధీ మ్యానిఫేస్టోలో పెట్టాల్సిన అంశాలపై కమిటీతో చర్చించినట్లు తెలిసింది. దీనిపై తుది నిర్ణయం నేడు తీసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ నేతల నుంచి కూడా సలహాలు స్వీకరించిన తర్వాత మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు.
ఎలక్షన్ కమిటీ కూడా...
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కూడా నేడు జరగనుంది. ఈ సమావేశంలో మూడో జాబితాలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ మూడో జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనిపై కూడా కొంత కసరత్తు చేసిన తర్వాత ప్రకటించనుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఈ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
Next Story