Thu Dec 19 2024 15:54:05 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మేఘాలయ ముఖ్యమంత్రిగా?
మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు
మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మేఘాలయలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ స్థానాలు దక్కలేదు. నేషనల్ పీపుల్స్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ చేరే స్థానాలు లభించకపోయినా 26 స్థానాల్లో గెలుపొందింది. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
రెండోసారి...
దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయన గవర్నర్ ను కోరారు. మొత్తం 32 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు ఇటీవల సమర్పించారు. నేషనల్ పీపుల్స్ పార్టీకి బీజేపీతో పాటు మరో పార్టీ హెచ్ఎస్పీడీసీ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంగ్మా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్యనేతలు హాజరయయే అవకాశముందని తెలిసింది.
Next Story