Fri Jan 10 2025 12:11:26 GMT+0000 (Coordinated Universal Time)
మతం మారితే కులం మారదు
ఒక మతం నుండి మరొక మతంలోకి మారడం వల్ల వ్యక్తి కులాన్ని మార్చలేమని కీలక వ్యాఖ్యలు చేసింది.
కేరళ హైకోర్టు ఒక మతం నుండి మరొక మతంలోకి మారడం వల్ల వ్యక్తి కులాన్ని మార్చలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విజు అబ్రహం బెంచ్ పిటిషనర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పిటీషనర్ పనియ కులానికి చెందినవాడని.. పనియ కులానికి సంబంధించిన అన్ని ప్రయోజనాలకు అతడు అర్హుడే అని తెలిపింది. మతం మారితే కులం మారదని.. పనియ కులానికి సంబంధించి అతడికి అన్ని అర్హతలు కలిగి ఉంటాడని.. అతడు కులానికి సంబంధించిన సర్టిఫికేట్ జారీకి అర్హుడని ప్రకటించింది. పిటిషనర్ రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్, 1950లోని రెండవ షెడ్యూల్ ప్రకారం గుర్తింపు పొందిన షెడ్యూల్డ్ తెగ కమ్యూనిటీ అయిన ‘పనియా’ కమ్యూనిటీకి చెందినట్లు పిటీషనర్ తెలిపారు.
పిటిషనర్ పానియా కమ్యూనిటీలో పుట్టాడు. పిటిషనర్ నెన్మనిలోని గోవిందమాల గిరిజన కాలనీలోని సుల్తాన్ బతేరిలోని నివసిస్తున్నారు. పిటిషనర్ తల్లికి ప్రత్యేకంగా ఉద్దేశించిన పథకంలో నివాస భవనాన్ని నిర్మించడానికి రూ.42,000/- మొత్తాన్ని మంజూరు చేశారు. పిటిషనర్ తండ్రి ఆర్థడాక్స్ సిరియన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవాడు. జనన ధృవీకరణ పత్రం కూడా పిటీషనర్ వయనాడ్లో జన్మించినట్లు వెల్లడిస్తుంది. పిటీషనర్ కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె కుటుంబం పానియా కమ్యూనిటీ జీవన విధానానికి, సామాజిక పరిస్థితులకు దూరంగా జీవితాన్ని గడుపుతున్నట్లు విచారణలో కనుగొన్నారు. కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వలేదు.
ఇందిరా వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసును బెంచ్ పరిశీలించింది. తల్లిదండ్రులలో ఒకరు అయినా షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగల కమ్యూనిటీకి చెందిన వాళ్లు అయితే.. పిల్లలు సంబంధిత కులానికి సంబంధించిన ప్రయోజనాలకు అర్హులు. అయితే పరిగణించవలసిన కీలకమైన అంశం ఏమిటంటే హక్కుదారు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వైకల్యాన్ని ఎదుర్కొన్నారా లేదా.. సమాజం హక్కుదారుని వారిలో ఒకరిగా అంగీకరించి, అదే సామాజిక సిద్ధాంతంలో జీవిస్తున్నారా అనేది పరిశీలించాల్సి ఉంటుందని బెంచ్ తెలిపింది.
Next Story