Mon Dec 23 2024 04:42:32 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్ : భారీగా పెరిగిన కొత్తిమీర ధర.. కిలో రూ.400
ఇటీవల కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో కొత్తిమీర పంట దెబ్బతింది. దీంతో కొత్తిమీర సరఫరా తగ్గిపోయింది. అరకొరగా వస్తున్న..
గతవారంతో పోలిస్తే.. ఈవారం కూరగాయల ధరలు కొండెక్కాయి. టమాటాలు, వంకాయలతో పాటు కొత్తిమీర ధర కూడా అందలాన్ని ఎక్కింది. కట్ట రూ.10 ఉండే కొత్తిమీర..ఏకంగా కిలో రూ.400కి చేరుకుంది. గతవారం కిలో కొత్తిమీర ధర రూ.80-రూ.100 వరకూ పలుకగా.. ఇప్పుడు రూ.400కి పైగా పలకడం వినియోగదారులను షాక్ కు గురిచేసింది. కొత్తిమీర ధర అమాంతం పెరగడానికి కారణం భారీ వర్షాలు.. వరదలు. తెలుగు రాష్ట్రాలకు దాదాపు కర్ణాటక నుంచి కొత్తిమీర సరఫరా అవుతుంటుంది.
ఇటీవల కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో కొత్తిమీర పంట దెబ్బతింది. దీంతో కొత్తిమీర సరఫరా తగ్గిపోయింది. అరకొరగా వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో.. దాని ధర కొండెక్కి కూర్చుంది. శని, ఆదివారాల్లో పలుమార్కెట్లలో కిలో రూ. 400 వరకు పలికింది. మహబూబాబాద్ జిల్లాలో రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, ధరల పెరుగుదలకు ఇదే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రైతుమార్కెట్లలో రూ.10 లకి అమ్మే కట్టని ఇప్పుడు రూ.50కి అమ్ముతున్నారు. ఇలా ధరలు పెరిగిపోతే కూరగాయలు కొనేదెలా.. తినేదెలా అని సామాన్యులు వాపోతున్నారు.
Next Story