Sun Nov 24 2024 22:47:52 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒక్కరోజులో 4.369 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒక్కరోజులో 4.369 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 20 మంది దేశంలో కరోనా కారణంగా చనిపోయారు. ఒక్కరోజులోనే కరోనా నుంచి 5,178 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4,45,04,949 కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,39,30,417 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 5,28,185 మంది కరోనా నుంచి మరణించారు. ప్రస్తుతం భారత్ లో 46,347 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 215.47 కోట్ల వ్యాక్సిన్ డోసుల ను అధికారులు పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు.
Next Story