Fri Dec 27 2024 22:04:59 GMT+0000 (Coordinated Universal Time)
Covid Cases Live Updates : దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయ్
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యి
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 797 కరోనా పాజిటివ్ కేసులు(Covid active cases)నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడంచారు. కరోనా వైరస్(Corona virusJn.12023)కారణంగా దేశ వ్యాప్తంగా ఐదుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ.
మరణాలు కూడా....
ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 4,097 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు అందాయి.
Next Story