Mon Dec 23 2024 09:19:35 GMT+0000 (Coordinated Universal Time)
కేసులు తగ్గాయి కానీ... డేంజర్ బెల్స్ ఆగలేదు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా కొంత తగ్గాయి ఈరోజు కొత్తగా 3,06,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా కొంత తగ్గాయి ఈరోజు కొత్తగా 3,06,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 439 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే కేసులు కొంత తగ్గాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,68,04,145 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు కూడా...
ప్రస్తుతం దేశంలో 22.49,335 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,95,43,328 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,89,848 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,62,66, 44674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. రోజు వారీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా నమోదయింది.
- Tags
- coronavirus
- india
Next Story