Mon Nov 18 2024 20:39:41 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకలో కరోనా అలజడి.. స్కూల్ బిల్డింగ్ కు సీల్
కర్ణాటకలో కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. క్ మంగళూరు జిల్లాలోని జీవన్ జ్యోతి హైస్కూల్ లో కరోనా కల్లోలం సృష్టించింది.
కర్ణాటకలో కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. ఇప్పటికే బెంగళూరులో ఒకట్రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో.. ఏ మహమ్మారి ఏ వైపు నుంచి వస్తుందోనని అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఈ తరుణంలో చిక్ మంగళూరు జిల్లాలోని జీవన్ జ్యోతి హైస్కూల్ లో కరోనా కల్లోలం సృష్టించింది. పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ కు, 10 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు స్కూల్ బిల్డింగ్ కు సీల్ వేశారు. ఆపై స్కూల్ పరిసర ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.
470 మందికి....
కాగా.. స్కూల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ తో కలిపి మొత్తం 470 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు చిక్ మంగళూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమేశ్ వెల్లడించారు. 470 మందిలో 11 మందికి పాజిటివ్ అని రాగా.. మిగతా వారందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపారు. పాజిటివ్ వచ్చిన 11 మందిలో వ్యాధి లక్షణాలేవీ లేవని, ప్రస్తుతం అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ కు సీల్ వేసినప్పటికీ.. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల ద్వారా బోధిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Next Story