Fri Dec 27 2024 20:50:50 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కరోనా అప్డేట్
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజుకు మూడు వేలకు దిగువనే కేసులు నమోదవుతున్నాయి.
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజుకు మూడు వేలకు దిగువనే కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. ఒక్కరోజులో 2,37,952 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2,678 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్యులు చెప్పారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
స్థిరంగానే కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 5,28,857 మంది కరోనా కారణంగా మరణించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 26,583 ఉన్నాయన్నారు. యాక్టివ్ కేసుల శాతం 0.06 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 219.21 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
Next Story