Sun Nov 24 2024 22:44:48 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులో 5,221 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 15 మంది కరోనాతో మరణించారు.
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆరువేలకు లోపు కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 5,221 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 15 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 5,975 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం కూడా 0.11 గా నమోదయిందని అధికారులు తెలిపారు.
వ్యాక్సినేషన్ కూడా...
భారత్ లో ఇప్పటి వరకూ 44,505,801 కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,25,239 మంది చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 5,28,165 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 47,176 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,15,26,13,04 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story