Sun Nov 24 2024 11:55:33 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. కేసులు పెరుగుతున్నాయ్
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కొత్తకేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు ఆదేశాాలను జారీ చేసింది. కేరళ, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా కఠినంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
నాలుగు వేలు...
గడిచిన 24 గంటల వ్యవధిలో నాలుగు వేలమందికి పైగా కరోనా బారినపడ్డారని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.నిన్న1,31,086 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు వచ్చాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి చేరుకుంది. పాజిటివిటీ రేటు 3.38 శాతానికి పెరగడం కూడా కలవరపరుస్తుంది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,30,916 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
Next Story