Mon Dec 23 2024 16:04:23 GMT+0000 (Coordinated Universal Time)
Work from Home : మళ్లీ వర్క్ ఫ్రం హోం.. అనేక సంస్థలు అదే దిశగా
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జేఎన్ 1 వేరియంట్ కేసులు కూడా నమోదవుతున్నాయి
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జేఎన్ 1 వేరియంట్ కేసులు కూడా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో ప్రముఖ ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోంకు అవకాశమిస్తున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో విప్రో సంస్థ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆరోగ్య పరంగా ఉండేందుకు వారికి ఈ అవకాశం ఇస్తున్నట్లు విప్రో ప్రకటించింది.
కొన్ని సంస్థలు ఇప్పటికే...
గత ఏడాది నుంచి అన్ని ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం కాకుండా కార్యాలయానికి విధిగా రావాలని ప్రకటించాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఆఫీసుకు విధిగా రావాలని చెప్పాయి. కొన్ని సంస్థలు మాత్రం ఇప్పటికీ వారంలో మూడు రోజుల పాటు మాత్రమే ఆఫీసుకు రావాలంటూ నిబంధనలు విధించాయి. అయితే తాజాగా కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండటంతో ఐటీ సంస్థలన్నీ మళ్లీ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించాయి. ఇప్పటికే దేశంలో నాలుగువేల కేసులు దాటడంతో ముందు జాగ్రత్త చర్యగా వర్క్ ఫ్రం హోం కు అవకాశాలు కల్పిస్తున్నాయి.
Next Story