Thu Dec 26 2024 01:50:59 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ కు కరోనా ముప్పు తప్పదా?
భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది
భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 7,830 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన ఏడు నెలల్లో భారత్ లో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
పెరుగుతున్న యాక్టివ్....
ప్రస్తుతం భారత్ లో 40,215 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 10,11 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను పాటించకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. కేసుల సంఖ్య ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అని అంటున్నారు.
Next Story