Wed Dec 25 2024 14:04:39 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : కరోనా కేసులు ఈరోజు ఎన్నంటే?
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే కేసులు నమోదు కావడం విశేషం. కేరళలో 128 కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ కారణంగా ఒకరు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ రాష్ట్రాల్లోనే...
కేరళ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలో 96 మందికి కరోనా వైరస్ సోకింది. మహారాష్ట్రలో 35, ఢిల్లీలో పదహారు మందికి, తెలంగాణలో పదకొండు మందికి, గుజరాత్ లో పది మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ భారత్ లో యాక్టివ్ కేుల సంఖ్య 3,742 కు చేరుకుంది. కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.
Next Story