Mon Nov 25 2024 01:31:32 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 7,219 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 7,219 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 33 మంది మరణించారు. ఒక్కరోజులోనే 9,651 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.68 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.13 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు స్వల్పంగా పెరిగినా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
యాక్టివ్ కేసులు తగ్గుతున్నా....
ఇక దేశంలో ఇప్పటి వరకూ 4,44,49,726 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,38,65,016 మంది కరోనా నుంచి చకిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,27,965 మంది మరణించారు. ఇక ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 56,745 గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ను అధికారులు వేగవంతం చేశారు. 213.01 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story