Sun Nov 24 2024 16:48:07 GMT+0000 (Coordinated Universal Time)
కంట్రోల్ లోకి వచ్చిన కరోనా
భారత్ లో కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చింది. రోజుకు రెండు వేల కేసులకు తక్కువగానే నమోదవుతున్నాయి
భారత్ లో కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చింది. రోజుకు రెండు వేల కేసులకు తక్కువగానే నమోదవుతున్నాయి. ఇటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. ఒక్కరోజులో 2,76,125 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 1,957 మందికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు శాతం 98.75 శాతంగా నమోదయింది.
యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ 4,46 కోట్ల మంది వరకూ కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,40,60,198 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకూ 2,19,04,76,220 కరోనా వ్యాక్సిన్ డోసులను వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ భారత్ లో 5,28, 822 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం భారత్ లో కోవిడ్ యాక్టివ్ కేసులు 27,374కు చేరుకున్నాయి. కోవిడ్ కేసులు తగ్గుతున్నా నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story