Tue Dec 24 2024 13:50:54 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ఒక్కరోజులో ఇన్ని కేసులా?
కరోనా వైరస్ దేశంలో ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.
కరోనా వైరస్ దేశంలో ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ కేరళ రాష్ట్రానికే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 529 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కర్ణాటకలో వైరస్ సోకిన వారు విధిగా వారం రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మూడు మరణాలు...
కర్ణాటకలో ఒక్కరోజులోనే 74 కేసులో నమోదు కావడంతో ఆ ప్రభుత్వం అప్రమత్తమయింది. మాస్క్లు కూడా విధిగా ధరించాలని పేర్కొంది. ఒక్కరోజులో ముగ్గురు మరణించారు. కరోనా వైరస్ కారణంగా మరణాలు కూడా నమోదు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరణించిన ముగ్గురిలో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారు కాగా, ఒకరు గుజరాత్ కు చెందిన వారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 4,093 యాక్టివ్ కేసులున్నాయని వైద్యశాఖ అధికారులు వెల్లడంచారు.
Next Story