Fri Dec 27 2024 20:30:14 GMT+0000 (Coordinated Universal Time)
అదుపులోనే కరోనా...అయినా భయమే
భారత్ లో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లతోనే ఆందోళన నెలకొంది.
భారత్ లో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లతోనే ఆందోళన నెలకొంది. ఒక్కరోజులో 1,994 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా ఒక్కరోజులో నలుగురు మరణించారు. మరణాల సంఖ్య కొంత తక్కువగానే ఉంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్లతో అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. విధిగా మాస్క్ లను ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని చెబుతున్నారు. అత్యంత వేగంగా ఈ వేరియంట్ విస్తరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
వైరస్ కట్టడికి...
దేశంలో ఇప్పటి వరకూ 4,46,42,742 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో కరోనాకు చికిత్స పొంది 4,40,90,349 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. భారత్ లో ఇప్పటి వరకూ 5,28,961 మంది మరణించారని అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల శాతం 0.05 శాతంగా నమోదయింది. రికవరీ రేటు 98.76 శాతంగ నమోదయిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా నమోదయింది. ప్రస్తుతం భారత్ లో 23,432 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 219.55 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story