Wed Dec 25 2024 14:12:58 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : ఏందయ్యా ఇదీ... నిజంగానేనా? మళ్లీ తరుముతోందా?
భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది
భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. రాష్ట్రాలు వైరస్ వచ్చిన వారిని గుర్తించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గదులను ఏర్పాటు చేయాలని తెలిపింది. రెండేళ్ల క్రితం కరోనా రావడంతో లక్షల సంఖ్యలో మృతి చెందారు. కనీసం మృతదేహాలను ఖననం చేయడానికి కూడా సమీప బంధువులు రాలేకపోయారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలు ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఈ వేరియంట్...
ప్రధానంగా జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి జరుగుతుండటం కొంత భయాందోళనలకు గురి చేస్తుంది. నిన్న కరోనా వైరస్ తో 335 మంది బాధపడటం, అందులో ఐదుగురు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కేరళలోనే ఎక్కువగా ఈ వ్యాధి ప్రబలుతుంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ వైరస్ సోకిందని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడమే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ...
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. జేఎన్ 1 వేరియంట్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుందని, అందుకే మాస్క్ లు ధరించడం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ 2.86 తో పాటు జేఎన్ 1 కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. ఇప్పటికే సింగపూర్ వంటి దేశాలు మాస్క్ లను కంపల్సరీ చేశాయి. మన దేశంలో కర్ణాటకలోనూ సీనియర్ సిటిజన్లు విధిగా మాస్క్లు వాడాలని పేర్కొంది. అప్పుడే వైరస్ ను వ్యాప్తి చెందకుండా చూడగలమని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఈ వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు.
Next Story