Mon Dec 23 2024 16:44:55 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు తగ్గాయి. చాలా రోజుల తర్వాత నాలుగు రోజుల దిగువకు కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు తగ్గాయి. చాలా రోజుల తర్వాత నాలుగు రోజుల దిగువకు కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత నాలుగు వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 2.74 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 3,230 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కరోనా రికవరీ రేటు 98.72 శాతంగా నమోదయింది.
నెలల తర్వాత...
నిన్న ఒక్కరోజులోనే 4,255 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,40,04,553 కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 42,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.18 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ దేశంలో నమోదయిన కరోనా కేసులు 4.45 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకూ 5,28,562 మంది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మరణించారు. ఇప్పటి వరకూ 217.8 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Next Story