Fri Nov 22 2024 19:08:53 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్: బీజేపీ, ఆప్ హోరా హోరీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. బీజేపీ, ఆప్ సమాన సంఖ్యలో ఆధిక్యాన్ని కనపరుస్తున్నాయి.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. కౌంటింగ్ లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ సమాన సంఖ్యలో ఆధిక్యాన్ని కనపరుస్తున్నాయి. ఈ నెల 4న డిసెంబరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహించాయి. గత ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమలం పార్టీ వశమయింది. ఈసారి తమ పరం చేసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రమించింది.
పోటా పోటీగా...
తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్పొరేన్ పరిధిలో ఏమేం చేస్తామో అన్ని పార్టీలు చెప్పాయి. ఉచితాల కంటే మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో ముందుంటామని అవి ప్రజలకు హామీ ఇచ్చాయి. మొత్తం 250 వార్డులున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పోలింగ్ 50 శాతం మాత్రమే నమోదయింది. మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 128 వార్డుల్లోనూ, బీజేపీ 116 స్థానాల్లోనూ, కాంగ్రెస ఐదు వార్డుల్లోనూ ఆధికత్య కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి.
Next Story