Sat Dec 21 2024 04:47:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : దేశ వ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉందంటే...? ఎన్డీఏదే ఆధిక్యం
ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయింది. ట్రెండ్స్ పై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది
ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయింది. ట్రెండ్స్ పై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. దేశంలో ఎవరు అధికారంలోకి రారున్నారన్నది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ఈసారి హోరా హోరీ పోరు జరిగిందని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మోదీ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పినా ఈసారి మెజారిటీ తగ్గే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలట్ లో31 ఎన్డీఏ ఆధిక్యంలో ఉండగా, 18 చోట్ల ఇండియా కూటమి, ఒక చోట ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.
ఉత్తర భారతదేశంలో...
ఉత్తర భారత దేశంలో బీజేపీకి ఈసారి గతంలో వచ్చిన సీట్లు రావన్న అంచనాలు వినపడుతున్నాయి. ప్రధానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి గతంలో వచ్చిన స్థానాల కంటే కొద్దిగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం మోదీదే మళ్లీ అధికారమని చెబుతున్నాయి. ఇండియా కూటమి కూడా ఈసారి ఆత్మవిశ్వాసంతో ఉంది. పదేళ్ల మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story