Mon Dec 23 2024 16:14:23 GMT+0000 (Coordinated Universal Time)
కొవాగ్జిన్ కు అత్యవసర అనుమతులు.. 12 ఏళ్లు పైబడిన వారికి కూడా..
జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ డి తర్వాత చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతులు పొందిన టీకా కొవాగ్జినే కావడం విశేషం. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన
తెలంగాణకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కు అత్యవసర అనుమతులు లభించాయి. ఇకపై ఈ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు ఈ అనుమతులు వచ్చాయి. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ప్రకటన చేసింది. జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ డి తర్వాత చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతులు పొందిన టీకా కొవాగ్జినే కావడం విశేషం. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. డీసీజీఐ ఇచ్చిన అత్యవసర అనుమతులతో.. ఇకపై 12 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా కొవాగ్జిన్ ఇవ్వనున్నారు.
జనవరి 3 నుంచి టీకా
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. కొవాగ్జిన్ కు ఈ అనుమతులు రావడం కాస్త ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. అయితే, ఈ టీకా పంపిణీ ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. కొవాగ్జిన్ టీకా మొదటి డోసు వేసిన 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఈ టీకాతో పిల్లలకు కరోనా నుంచి రక్షణ లభిస్తుందని క్లినికల్ పరీక్షల్లో వెల్లడైనట్టు భారత్ బయోటెక్ తెలిపింది. ఇదిలా ఉండగా.. క్రిస్మస్ రోజు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. 15 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు జనవరి3వ తేదీ నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే జనవరి 10వ తేదీ నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులు, 60 ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యుల సలహాపై 'ప్రికాషన్ డోసు' ఇవ్వనున్నట్టు మోదీ పేర్కొన్నారు.
Next Story