Tue Nov 05 2024 19:34:12 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా కథ ముగిసింది.. కానీ మనతోనే ఉంటుంది : లాన్సెట్ మెడికల్ జర్నల్
లాన్సెట్ మెడికల్ జర్నల్ పత్రికను వైద్య రంగానికి విశ్వసనీయమైన పత్రికగా చెప్తుంటారు. ఆ పత్రికే కరోనా అంతం గురించి..
కరోనాతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రపంచ దేశాలకు లాన్సెట్ మెడికల్ జర్నల్ పత్రిక ఓ తీపి కబురు చెప్పింది. కరోనా ఎండెమిక్ (అంటువ్యాధి) మారినట్లు ఆ పత్రిక ప్రచురించింది. లాన్సెట్ మెడికల్ జర్నల్ పత్రికను వైద్య రంగానికి విశ్వసనీయమైన పత్రికగా చెప్తుంటారు. ఆ పత్రికే కరోనా అంతం గురించి ఓ ప్రచురణ చేసింది. కరోనా ఒక మహమ్మారిగా విరుచుకుపడే శక్తిని కోల్పోయిందని, ఇక దానికి స్వల్పంగా అనారోగ్యానికి గురిచేసే శక్తి మాత్రమే ఉంటుందని రాసుకొచ్చింది.
కరోనా అంటు వ్యాధి కాబట్టి.. అది దాని శక్తిని కోల్పోయినా.. సీజనల్ వ్యాధుల రూపంలో మనతోనే ఉంటుందని పేర్కొంది. రుతువులు మారే క్రమంలో వచ్చే సాధారణ జలుబు, జ్వరం రూపంలో కరోనా కొనసాగుతుందని తెలిపింది. సాధారణ అంటు వ్యాధిలా ఉంటుంది కాబట్టి.. దాని వల్ల తీవ్ర అనారోగ్యం ఉండకపోవచ్చని లాన్సెట్ తెలిపింది. కానీ.. కరోనా పట్ల మన జాగ్రత్తలో మనం ఉండటం మేలని, అందరూ మాస్కులు ధరించడం మానవద్దని సూచించింది.
Next Story